అమ్మ చుట్టూ అల్లుకున్న ప్రపంచం బావుంటుంది
ఎవరైనా పట్టుకుంటామంటే అమ్మ వెనక దాక్కుంటాం
ఎవరైనా బెదిరిస్తే అమ్మనల్లుకుని పడుకుంటాం
భోజనమయ్యకా చేయి కడిగి అమ్మ కొంగుకు తుడుచుకుంటాం
ఆటలు ఆడి అలిసిపోతే అమ్మ ఒడిలో తలాన్చి నిదురిస్తాం
నిద్రలో పీడకల వచ్చి గుండె కొట్టుకునే వేగం పెరిగినపుడు అమ్మ తలమీద చెయ్యివేసి నిమురుతూనే శాంతిస్తాం
నాన్న అల్లరి చేశావని తిడితే అమ్మ దగ్గర గారాలు పోతాం
ఏదైనా కొనుక్కోవాలని అడగాలంటే అమ్మ రికమండేషన్ మీదే అధారపడతాం
ఆకలేసిన మరుక్షణం గుర్తొచ్చేది అమ్మ చేతిముద్దలే
ఆడపిల్లలు అమ్మని అనుకరిస్తారు
మగపిల్లలు అమ్మ లాంటి వ్యక్తిత్వం కల భార్య కావాలనుకుంటారు
ఎదుగుతున్న పిల్లలకు దాదపు పదేళ్ళు నిండేవరకూ అమ్మే ఆదర్శం
ఆమె ఎలా ఉంటే తామూ అలానే ఉండాలనుకుంటారు.
ఆమె ఏం చేస్తే తామూ అలానే చెయ్యలనుకుంటారు.
అందుకే తల్లికి పిల్లల పసిదనం ఒక పరీక్షా సమయం. ఎంత ఓర్పుగా నేర్పుగా పెంచితే, అంత చక్కని వ్యక్తిత్వంతో పెరిగి పెద్దవారవుతారు. ఒక శిల్పి అహోరాత్రులూ కష్టపడి శిల్పాన్ని ఏ విధంగా చెక్కుతాడో, అదేవిధంగా తల్లి తన బిడ్డలను సాకుతుంది.
పిల్లలు విద్యలో, ఆటపాటల్లో ఏది సాధించినా అది ఆమె గెలుపుగా భావించి మురిసిపోతుంది. అటువంటి తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించి తగిన గౌరవం, ప్రేమ, అభిమానం తుదివరకూ ఆమెపై చూపి ఆమె మనసు కష్టపెట్టకుండా చూసుకోవడం మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక కర్తవ్యం.
– మాతృదేవోభవ
ఇట్లు
మీ
లావణ్య
19/1/18