Select Page

Author: Bhavalavanyam

Ammaku Vandanam

“అమ్మకు వందనం” అవునండీ, ఈ సంవత్సరం పాఠాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆచారం. కొత్తగా ఉంది కదా. కాదు, నాకైతే అద్భుతంగా అనిపించింది. నిజానికి మహిళలను గౌరవించడమే మన దేశ సంస్కృతికి చిహ్నంగా భారతీయత పేరు పొందింది. కానీ నేటి ఆధునిక సమాజపు పోకడలు, ఆలోచనా తీరులో వచ్చిన మార్పులు ఒకింత భయాన్ని గోల్పుతున్న రోజులలో, ఈ కొత్త మార్పు, కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది అనే ఆశా భావం కలిగిస్తోంది. మన సంస్కృతిని విడిచి, మెకాలే మనకు నిర్దేశించిన దిశగా పాఠాలు నేర్చుకుంటున్న మనం, కొంత మన సంస్కృతి సంప్రదాయాలపై దృష్టి సారించి మన ఆచారాలను పాటించడం, మన హిందూ ధర్మం పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం అని సమాజంలోని విజ్ఞత గల పెద్దలు అందరూ నొక్కి ఒక్కాణిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. మన విద్యా వ్యవస్థ మారాలి, రాబోయే తరం యువతీ యువకులకు బంధాలు బంధుత్వాల పట్ల...

Read More

Seve Parama Dharmam

** సేవే పరమ ధర్మం- అదే శ్రీరమ రక్ష** “ఒరేయ్, నిద్రలేవరా, ఉదయాన్నే ఆఫీస్ ఉంది. త్వరగా వెళ్ళాలి, కాస్త తొందరగా నిద్రలేపు అమ్మా! అన్నావ్ గా” అంటూ ముందు మాటలు లేపుతున్నందుకు సంజాయిషీగా చెప్తూ కొడుకుని గారంగా నిద్ర లేపుతోంది రేవతి. రేవంత్, 25 ఏళ్ళ చక్కని చురుకు తెలివి కలిగిన యువకుడు, రేవతి కొడుకు. ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ చిన్నప్పటినుంచీ అన్నీ నేర్పి తనకు చేదోడు వాదోడుగా అర్ధం చేసుకునే మనస్తత్వం అలవడేలా పెంచింది రేవతి. భర్త ధర్మతేజ ఎంతో ఉదాత్తమైన స్వభావం కలవాడు. కుటుంబం అంటే ప్రేమ, చుట్టుపక్కల మనుషులు, పర్యావరణం అంటే ఎంతో దయ స్నేహభావం కలిగిన వ్యక్తి. రేవతి కూడా చక్కగా చదువుకుంది. కానీ తమ కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగం చేసి సంపాదించ వలసిన అవసరం లేదు కాబట్టి ఆమె సరదాగా ఒక కంపనీలో ఆఫీస్ సెక్రటరీగా పని చేస్తూ, వచ్చిన...

Read More

Amma

అమ్మ చుట్టూ అల్లుకున్న ప్రపంచం బావుంటుంది ఎవరైనా పట్టుకుంటామంటే అమ్మ వెనక దాక్కుంటాం ఎవరైనా బెదిరిస్తే అమ్మనల్లుకుని పడుకుంటాం భోజనమయ్యకా చేయి కడిగి అమ్మ కొంగుకు తుడుచుకుంటాం ఆటలు ఆడి అలిసిపోతే అమ్మ ఒడిలో తలాన్చి నిదురిస్తాం నిద్రలో పీడకల వచ్చి గుండె కొట్టుకునే వేగం పెరిగినపుడు అమ్మ తలమీద చెయ్యివేసి నిమురుతూనే శాంతిస్తాం నాన్న అల్లరి చేశావని తిడితే అమ్మ దగ్గర గారాలు పోతాం ఏదైనా కొనుక్కోవాలని అడగాలంటే అమ్మ రికమండేషన్ మీదే అధారపడతాం ఆకలేసిన మరుక్షణం గుర్తొచ్చేది అమ్మ చేతిముద్దలే ఆడపిల్లలు అమ్మని అనుకరిస్తారు మగపిల్లలు అమ్మ లాంటి వ్యక్తిత్వం కల భార్య కావాలనుకుంటారు ఎదుగుతున్న పిల్లలకు దాదపు పదేళ్ళు నిండేవరకూ అమ్మే ఆదర్శం ఆమె ఎలా ఉంటే తామూ అలానే ఉండాలనుకుంటారు. ఆమె ఏం చేస్తే తామూ అలానే చెయ్యలనుకుంటారు. అందుకే తల్లికి పిల్లల పసిదనం ఒక పరీక్షా సమయం. ఎంత ఓర్పుగా నేర్పుగా పెంచితే,...

Read More

టంగు టంగు – Tangu Tangu

నిద్ర లేస్తూనే గోడ గడియారం టంగు టంగు మంటూ ఐదు నంబరు మీద చిన్న ముల్లు, 12 నంబరు మీద పెద్దముల్లు చూపెడుతున్నాయి. “హమ్మబాబోయ్, అప్పుడే తెల్లారిపోయిందా!” అని గడియారాన్ని తిట్టుకుంటూ మంచం దిగింది సాహితి. ముందు రోజు రాత్రే కూతురు కీర్తి ఆర్డర్ వేసి మరీ పడుకుంది, “రేపు బాక్స్ లో నాకు పూరి కూర కావాలి, రోజు ఉప్మా, దోస అంటూ నువ్వు పెడుతుంటే మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు,” అని మూతి మూడు వంకర్లు తిప్పుతూ. అసలే ఉదయం 6:30 ని కల్లా బస్సు వచ్చేస్తుంది. ఇంతలోగా దీని స్నానం, జడ, పైగా ఈ టిఫిను. ఎలారా భగవంతుడా అనుకుంటూనే, నిద్రపోయింది. మధ్యలో బాక్స్ పెట్టబోతుంటే ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఉడుత, వేసిన పూరి ఎత్తుకుపోయింది. ఉన్నప్పుడల్లా ఆ ఉడుతను చూసి మురిసిపోయే సాహితికి, ఈరోజు ఆ ఉడుతని చూస్తే చచ్చేటంత కోపం వచ్చింది....

Read More

Aatmahatya Parishkarama? – ఆత్మహత్య పరిష్కారమా?

నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినోత్సవం అట.. ఈ మాట అనుకోవడానికి కూడా ఎంత బాధగా ఉందో కదా… ఒకప్పుడు ప్రాయోపవేశం చేస్తానన్న పురాణ పాత్రలను “ఆత్మహత్య మహాపాపం” పిరికితనం వదిలి పోరాడమని ప్రోత్సహించిన చరిత్ర మనది చట్టరీత్యా ఆత్మహత్య నేరమని తీర్పు చెప్పే దేశం మనది మరొకరి ఇంట్లో ఎవరైనా మృతి చెందినా బాధపడి ఆ మాట కూడా గట్టిగా అనడానికి ఇష్టపడని మనస్తత్వాలు మనవి, వారి బాధకు మనం కూడా ఓదార్పు చూపి, ‘చావు’ అన్న మాట వినపడితే ‘అమంగళం ప్రతిహతమగు గాక’ అని తశ్శాంతి పడే మనసులు మనవి మరి ఈ రోజు ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా ఏమిటీ ఆత్మహత్యల వార్తలు? ఎటు పోతున్నాం మనం? అసలేం కోరుకుని పరుగులు తీస్తున్నాం? అసలు దీని వెనకన ఉన్న ప్రధాన కారణాలను చూద్దాం…. ప్రతి ఒక్కరూ చెప్పే ప్రధాన కారణాలు ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం… ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి. 1. పిల్లలు చదువుకుని పైకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సహజంగా వారిని కాస్త గదమాయించో, నయానో భయానో మంచి మార్గంలో పెట్టాలని ఆలోచిస్తారు. అందుకే మందలింపులు. అంతే గానీ పిల్లలని మందలించడం వెనక తల్లిదండ్రులకు వేరే చెడు ఉద్దేశ్యాలు ఏమీ ఉండవుగా… మరెందుకు చాలా మంది పిల్లలు ఈ చిన్న విషయాలను అర్ధం చేసుకోలేకపోతున్నారు? చిన్నమందలింపులకే ఆత్మహత్యల దాకా ఎందుకు చేరుతున్నారు? పిల్లలకు పూర్వం తాత, బామ్మ, మావయ్య, పిన్ని, అక్క, చెల్లి అంటూ ఉమ్మడి కుటుంబాలలో అందరి ఆదరణ ఆప్యాయత అందేవి. కానీ ఇప్పుడు ఒంటరి బ్రతుకులు. తిట్టినా లాలించినా అమ్మా నాన్నే. పైగా ఎక్కువగా గడిపేది టీవీ లతోనే. ఏ ఛానెల్ పెట్టినా పెద్దవారిని ఎదిరించడం ఎలా, చదువుకు బంక్ కొట్టి అవారాగా తిరగడం ఎలా, పిచ్చి పిచ్చి సంభాషణలూ, అర్ధం లేని సన్నివేశాలు, వినలేక చెవులు మూసుకోవాలనిపించే సంస్కార హీనమైన భాష ఇలా ఒకటేమిటి, అన్నీ అలాంటివే. పైగా వార్తలు, సీరియల్స్, సినిమాలు వంటి అన్నిటిలో చస్తాను అని బెదిరించడం, ఆత్మ హత్య చేసుకోవడం వంటి కార్యక్రమాలు సర్వసాధారణం. మరి ఇవే పదే పదే చూసే పసిమనసులకు ఈ మార్గం తప్ప ఏది...

Read More

Subscribe

Pin It on Pinterest