Select Page

Author: Bhavalavanyam

Spurthi – స్ఫూర్తి

చేసే పని ఏదైనా ఎంత చిన్నదైనా నమ్మకంతో చేయడం అవసరం ఎన్నిసార్లు గెలుపోటములు‌ చూశామని కాదు ఎన్నిసార్లు ప్రయత్నించామన్నది ముఖ్యం ప్రతి ప్రయత్నంలోనూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటాము ప్రతి ఓటమిలోనూ ఎంతో కొంత అనుభవం గ్రహిస్తాము తిరిగి మరలా చేసే ప్రయత్నంలో కొత్తపాఠాలను, పాత అనుభవాలను క్రోడీకరించి వ్యూహరచన చేయడం అవసరం ఉత్సాహం, ఆశ, నమ్మకం, పట్టుదల, ప్రయత్నం, తపన ఇలా ఎన్నో విషయాల మేలు కలయిక జీవితంలో విజయం ఉఛ్వాశ నిశ్వాసాలు గమనించాలి – ఒకసారి గుండెలనిండా గాలి తీసుకుంటే రోజంతటికీ సరిపోదు, మళ్ళీ మళ్ళీ ఈ ప్రక్రియ కొనసాగితేనే జీవితం గుండె కొట్టుకుని నిరంతరం రక్తశుధ్ధి జరుపుతూనే ఉండాలి, క్షణమాగినా జీవితం సాగదు ప్రతి పూటా శరీరానికి కావలసిన పోషకాలను అందించాలి, ఆరోగ్యంగా ఉంచే ప్రతి ప్రక్రియనూ జరిపితీరాలి విరామాలు నడవవు మనం జీవించడానికి శరీరంలోని ప్రతి కణం అలుపెరుగక పరుగెడుతుంటే మనకెందుకు స్పూర్తి దొరకదు? మనసెందుకు బాహ్యస్పూర్తి పై అంతలా ఆధారపడుతుంది? ప్రకృతిలోని ప్రతి జీవి మనకు స్ఫూర్తి దాయకమేగా అలా చూస్తే సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత జ్వాలలు, విషవాయువులు, కాలుష్యం, మానవ తప్పిదాలు ఇన్ని ఉన్నా ప్రకృతి తిరిగి చిగురించడం మానలేదే మరి మనుషులం, తెలివి, ఆలోచన, విచక్షణ, వ్యూహరచన వంటి ఎన్నో వరాలు ప్రకృతిసిధ్ధంగా పుట్టుకతో పొందిన మనకి స్పూర్తికి కరువా? ఆలోచించాలి అడుగులేయాలి గెలుపు మనదే గెలవాలని నడవాలి గెలుస్తామని నమ్మాలి గెలిచేదాకా నడవాలి గెలిచి తీరాలి – లావణ్య...

Read More

Toli Adugu – తొలి అడుగు

శరత్ చంద్ర ఈమధ్యే ట్రాన్స్ఫర్ మీద ఒక కొత్త ఊర్లో ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ అనుకునేరు, హెల్త్ ఇన్స్పెక్టర్ అండి. స్వతహాగా మంచి వ్యక్తి, పైగా సేవా తత్వం ఉన్నవాడు. ఎన్నో ఏళ్ళుగా అదే ఉద్యోగంలో ఉన్నమీదట, డాక్టరు కోర్సు చదవకపోయినా అనుభవం మాత్రం అంతకంటే ఎక్కువే. అందువల్ల చుట్టుపక్కల ఎటువంటి చిన్న చితక వైద్య సంబంధిత సహాయానికైనా అర్ధరాత్రి అపరాత్రి అనే భేదం లేకుండా ఉన్నపళంగా వెళ్ళి అక్కడ అన్నీ సర్దుకున్నాయని నిర్ధారించుకున్నాకే తిరిగివచ్చేవాడు. అతడి మంచితనానికి తోడు అతడి ఇల్లాలు తారకి కూడా అంతే జాలి, దయ, సేవా తత్పరత. అందుకే దగ్గర ఉన్న అనాథాశ్రమం పిల్లలకి, మురికివాడల్లో పిల్లలకి స్వఛ్ఛందంగా పాఠాలు నేర్పడానికెళ్తుంది. ఏమైనా చిన్న చితకా మందుల అవసరాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నచోట భర్త సాయంతో మందులు, తగిన సలహాలు అందించడం ఆమెకు ఇష్టమైన పని. ఇంకేం, భార్యా...

Read More

Aame Teerpu – ఆమె తీర్పు

చరిత్ర రోజులా తనకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చుంది. ఎప్పుడొచ్చాడో తెలీదు, ఆమె భర్త ఫణి. అతను వస్తూనే సరాసరి తన గదిలోకెళ్ళి తలుపేసుకున్నట్టున్నాడు ఎప్పటిలానే. చప్పుడుకి ఒకసారి అటు తిరిగి చూసి, చదువుతున్న పుస్తకాన్ని జాగ్రత్తగా బుక్మార్క్ పెట్టుకుని పక్కన పెట్టి అక్కడినుంచి కదిలింది. వంటింట్లో పాలు స్టవ్ మీద పెట్టి కాఫీకి ఏర్పాట్లు చేస్తుండగా, ఒక పదినిముషాల్లో ఫణి గదిలోంచి ఫ్రెష్ అయి బయటికొచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయట బాల్కనీలో కూర్చున్నారు. “ఏమైంది? అలసటగా ఉన్నారు?” అంది చరిత్ర. “ఈ రోజు ఒక విచిత్రమైన కేసుకు తీర్పు చెప్పవలసి వచ్చింది. సాధారణంగా ఎప్పటిలాగే బయట సర్దుబాటుకి ప్రయత్నించాము. కానీ ఒకపార్టీ మొండిగా పట్టు పట్టడంతో తప్పలేదు.” అన్నాడు ఫణి. ఆయన కోర్టులో జడ్జి గా చేస్తున్నాడు. నిత్యం అన్ని కేసుల గురించీ భార్యతో చర్చించడు. కానీ, ఈరోజెందుకో చర్చించడం చూసి చరిత్రకి...

Read More

ఇలా ఎన్నాళ్ళు? – Ila Yennallu?

“సరస్వతీ, ఆఫీసుకెళ్ళొస్తా!” అంటూ చెప్పులేసుకుంటున్నాడు బ్రహ్మాజీ. ఎప్పుడూ సరే, శుభం అంటూ గుమ్మందాకా వచ్చే అతని భార్య ఎందుకో లోపలినుంచే “సరే వెళ్ళిరండి” అంటూ సమాధానమిచ్చింది. అతనికెందుకో మనసుకు అదోలా అనిపించినా ఆఫీసు టైం అయిపోతోందన్న హడావుడిలో పెద్దగా పట్టించుకోలేదు. సరస్వతి మనస్తత్వశాస్త్రం చదువుకుని తన సాటి మహిళలకు అవసరమైన విషయాలలో సలహాలిస్తూ వారికి ఆనందకరమైన జీవితాన్ని గడపడం ఎలాగో నేర్పిస్తూ తనకు తోచిన మార్గంలో సమాజ సేవ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు. తన విద్య తన తోటివారికి ఉపయోగపడితే చాలు అనే మనస్తత్వం ఆమెది. అందుకే అవసరంలో ఉన్న వారందరికీ ఆమె పెద్దదిక్కుగా ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. సరస్వతీ బ్రహ్మాజీలు అన్యోన్యదాంపత్యం గల జంట. పెళ్ళై ముప్పై ఐదు సంవత్సరాలవుతోంది. గొడవలూ పొరపొచ్చాలు లేని సంసారం. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. అమ్మాయికి పెళ్ళై ఇద్దరు పిల్లలు, అబ్బాయి చదువై ఏదో ఆ చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించాలనే తపనలో తిరుగుతున్నాడు. కూతురు ఇదే ఊళ్ళో ఉంటుంది. ఆమె కొడుకు పెద్దవాడు అనిల్, పదవతరగతి చదువుతున్నాడు. కూతురు చిన్నది ప్రశాంతి, ఏడవ తరగతి. చదువులో ఆటపాటల్లో ఇద్దరూ ముందుంటారు. బోలెడన్ని మెడల్స్ సర్టిఫికేట్స్ . అల్లుడు తన వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. తిండికి బట్టకి ప్రేమకు ఆప్యాయతకూ కొదువ లేని సంసారం వాళ్ళది. ఎందుకో ఈమధ్య కూతురు పెద్దగా కాల్స్ చేయటం లేదు. అన్యమనస్కంగా ఉంటోంది. ఎందుకో కీడు శంకించి వాళ్ళింటికి వెళ్ళింది. అందరూ ఉన్నారు. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్తుండగా మనవడు అనిల్ అటుగా వెళ్ళడం చూసింది. ఎప్పుడూ ప్రేమగా దగ్గరకొచ్చి మాట్లాడే వాడు. ఎందుకో పలకరించీ పలకరించనట్లుగా చూసి వెళ్ళిపోయాడు. ఏదో మార్పు గమనించింది. కూతురిని అడిగితే, “టీనేజ్ కదమ్మా, ఇప్పటి పిల్లల విషయం చెప్పడానికి కూడా ఏముంది. అంతా తెలిసినదే. నచ్చితే తప్ప చెయ్యరు” అంటూ మాట మార్చింది కానీ తన తల్లి దృష్టిని ఏమార్చలేకపోయింది. నిన్నటి రోజున కొడుకు కౌశిక్ ఏదో ఇంటర్వ్యూ కి వెళ్ళొచ్చి, అమ్మా, “ఈరోజు అనిల్ ని చూశాను. ఎవరో ఫ్రెండ్స్ తో ఉన్నాడు. సిగరెట్టు కాలుస్తూ కనిపించాడు. గట్టిగానే మందలించాను. బహుశా మళ్ళీ చెయ్యకపోవచ్చు....

Read More

Mana yuvata mana bhavita – మన యువత మన భవిత

నిత్యనూతనమైన ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానము సంతరించుకుంటున్న ప్రపంచం మానవమనుగడకు రానురాను దుస్సాధ్యం అనిపించే వైపుగా వడివడిగా పరుగులు తీస్తోందని మీలో ఎవరికైనా భయం కలిగిందా? ఒకసారి ఆలోచించాను, రెండు సార్లు, నాలుగు సార్లు కాదు ఎన్ని వందలసార్లు ఆలోచించి చూసినా జవాబు దొరకని ప్రశ్నలెన్నో… కొన్ని మీ ముందుంచుతా.. కలిసి ఆలోచిద్దామా?! అమ్మ వడిలో పారాడవలసిన పసి ప్రాయాలు కల్తీ పాలకు బలైపోతున్నాయెందుకు? ఇంటి ముంగిట ప్రశాంతంగా ఆడుకోవలసిన చిన్న వయసులు కాంక్రీటు గోడలమధ్య ఙ్ఞానసముపార్జన పేరుతో బట్టీ పట్టే పాఠాలమధ్య నలుగుతున్నాయెందుకు? ఆరుబయట ప్రశాంతంగా ఆడుకోవలసిన బాల్యం అపహరణల భయంతో కృంగిపోతున్నాయెందుకు? ఇంటినుంచి కళాశాలలకు వెళ్ళే యువత మత్తుమార్గం పడుతున్నారెందుకు? చదువులనీ ఉద్యోగాలనీ బయటకెళ్ళిన మన ఆడపిల్లలు ఎప్పుడు ఏ మానవ మృగ దాహానికి బలౌతారో అన్న భయంతో గడుపుతున్నామెందుకు? రేపటి యువత భవిత ఇలా యంత్రాల మధ్య, కృత్రిమ బంధాలమధ్య, మత్తు, చెడు అలవాట్ల మధ్య, అసలు...

Read More

Subscribe

Pin It on Pinterest