Select Page

Author: Bhavalavanyam

Swatantra Bharatam – స్వతంత్ర్య భారతం

స్వతంత్ర్య భారతం పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతికా… అంటూ సంబరాలు చేసుకునే మన స్వాతంత్ర్య వేడుకలు మనందరిలో దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపుతూ వినిపించే గీతాలు మనలో ఏదో సాధించాలనే నూతనోత్సాహాన్ని కలిగించడం మనందరికీ అనుభవమైన విషయం. ప్రతి సంవత్సరం ఆగష్టు 15 వస్తోందంటే చాలు, నెల రోజుల ముందుగానే టీవీలలో దేశభక్తి గీతాలు, దేశ స్వాతంత్ర్య సాధనలో పోరాడిన అమరవీరుల కథలు, అప్పటి సందర్భాలను వివరిస్తూ వినిపించే కథనాలు, ఎటు చూసినా రెపరెపలాడే త్రివర్ణ పతాక చిత్రాలు ఇలా మన మనస్సులో దేశభక్తిని ప్రేరేపించే ఎన్నో విషయాలు మనం చూస్తుంటాము. అంతే కాదు, పాఠశాలల విషయమైతే చెప్పనే అక్కర్లేదు. నెలరోజుల ముందుగానే వివిధ రకాల పోటీలు నిర్వహించి, ఈ పర్వదినాన ఒక ముఖ్య అతిథిని ఆహ్వానించి వారి చేతులమీదుగా పోటీలలో బహుమతులు అందుకున్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేస్తారు. ఈ అనుభవం ప్రతి ఒక్కరికీ సొంతమైనదే. టీవీలలో...

Read More

Matrudevobhava 2 – మాతృదేవోభవ 2

మాతృదేవోభవ 2 1.“మీ అబ్బాయి కి డెంగ్యు, కంగారు పడవలిసిన అవసరం లేదు కానీ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యవలిసి ఉంటుంది. సెలైన్ పెడతాము. అవసరమైతే బ్లడ్ ఎక్కించ వలసి ఉంటుంది,” అన్నారు డాక్టర్. “నిన్నటిదాకా చలాకీగా తిరిగే పిల్లాడు అకస్మాత్తుగా ఇలా వేళ్ళాడిపోతున్నాడు డాక్టర్. భయంగా ఉంది. మాకున్నది వీడొక్కడే, ఎలాగైనా కాపాడండి డాక్టర్” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని ప్రాధేయపడింది సీత. “అంత కంగారు పడకండి అమ్మా, పర్వాలేదు. బ్లడ్ బాటిల్ ఎక్కిన్చినంత మాత్రాన ప్రాణానికి ప్రమాదం అనుకుంటే ఎలా?” అని నచ్చచెప్పి వార్డ్ కి పంపించారు డాక్టర్. పిల్లాడి రూమ్ కి వెళ్లి బెడ్ పక్కన కుర్చీలో కూలబడి, వాడి కాళ్ళు పడుతూ బాధపడుతూ, “ఏడుకొండల వాడా తండ్రి! ఈ గండం గట్తెక్కిస్తే నాలుగు శనివారాలు ఉపవాసాలు ఉంటాను తండ్రి” అంటూ మొక్కేసుకుంది. 2. “పిల్లకి ఈసారి ర్యాంకు వస్తే నూటొక్క కొబ్బరికాయలు కొడతాను దుర్గామ్మా” అంటూ...

Read More

Matrudevobhava 1- మాతృదేవోభవ 1

Matrudevobhava 1 / మాతృదేవోభవ 1 మాతృదేవోభవ శీర్షికను కొనసాగిస్తూ రెండవ భాగాన్ని అందిస్తున్నాను. చదివి ఆదరించగలరు. 1.“అమ్మా” అంటూ కింద పడి మోకాలికి దెబ్బ తగుల్చుకుని ఏడుస్తున్న శృతి దగ్గరికి తీసుకుని, “అయ్యో నా బంగారుతల్లీ!! దెబ్బ తగిలిందా అమ్మా?!! ఎందుకమ్మా అనవసరంగా పరుగులు!!” అంటూ కళ్ళ నీళ్ళ పర్యంతమై దెబ్బకి మందు వేసే పనిలో ఉంది సరోజ. “ఇప్పటిదాకా అల్లరి చేస్తోందని విరుచుకుపడ్డావ్ కదే! ఇంతలోనే కళ్ళ నీళ్ళా?? బావుందమ్మా సంబడం” అంటూ వర్ధనమ్మగారు కూతురిని చూసి మురిసిపోతూ లోపలి వెళ్ళేరు. 2.“ఒరేయ్!! ఈసారి గాని మార్కులు తక్కువ వచ్చేయో చితక్కొట్టేస్తాను” అంటూ పెద్ద బెత్తం పట్టుకుని దగ్గర కూర్చుని అటూ ఇటూ పారిపోకుండా కొడుకుని కూర్చోబెట్టి చదివిస్తోంది వసంత. వినలేదని వీపు వాచేలా రెండు దెబ్బలు వేసింది. వాడు ఏడుస్తూ చదవడం అయ్యేక ఆటలకు వెళ్ళిపోయేడు. తనూ తన పనిలో పడిపోయింది. రాత్రి నిద్రపోతున్న కొడుకుని...

Read More

Matrudevobhava – మాతృదేవోభవ

మాతృదేవోభవ అమ్మా! ఎంత బావుంటుందో కదా ఈ పిలుపు. ఎలాంటి వాళ్ళకైనా ఏ వయసులోనైనా ప్రేమ ఆప్యాయత ఆత్మీయతకు చిహ్నం చిరునామా అమ్మ. కడుపులో పడ్డ క్షణం నుంచీ భూమిపై పడేవరకూ తొమ్మిది నెలల పాటు తనని తాను మర్చిపోయి మనకోసమే ఊపిరి తీసుకునే అమృతమూర్తి అమ్మ. “కింద కూర్చోకు, అది తినకు, ఇలా వంగకు, అక్కడికి వెళ్ళకు”, అంటూ గర్భవతికి ఎన్ని ఆంక్షలో. అయినా, ఎంత ఇష్టమైన పదార్ధమైనా బిడ్డకు హాని కలుగుతుంది అంటే వెలేసి ముట్టుకోదు. తొలి ముద్ద బిడ్డకి అని చెప్తారు కాబట్టి సాత్మీకంగా తినాలి అంటే, తనకి అంత వరకు ఇష్టం లేక తినని నెయ్యి ముద్దా కుడా (చాలా మందికి ఇలా జరిగి ఉంటుంది) ఎంతో ఇష్టంగా తిని తర్వాత తన భోజనాన్ని స్వీకరిస్తుంది తల్లి. ఎన్ని మార్పులో శారీరకంగా, మానసికంగా. పురుడు పునర్జన్మ అంటారు. ఇన్ని రకాల మార్పులకు, పురిటి నెప్పులకు,...

Read More

Subscribe

Pin It on Pinterest

Shares
Share This