ప్రకృతి తొలి గురువు – Prakruti Toli Guruvu

గురుపూర్ణిమ శుభాకాంక్షలు  “గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర   గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః” గురువు లేకుండా ఏ విద్యా లేదనేది జగమెరిగిన సత్యం. ఏమంటారు?! బహుశా మీరందరూ గురువంటే వేదవ్యాసునివలె వేదాలు మనకందించేవాడు తల్లివలె మనకు మాటలు నడక నడత నేర్పేవారు తండ్రి వలె మన బాధ్యతలు మనకు నేర్పేవారు ఒక మాష్టారు వలె బళ్ళో ‘అ ఆ’ లు దిద్దించేవారు అంటే ఒక వ్యక్తి రూపంలో మనకన్నా వయసులో పెద్దగా, ఙ్ఞానంలో ఉన్నతంగా, వ్యక్తిత్వంలో మహోన్నతంగా ఉన్నవారే గురువు అనుకుంటున్నారా? “అబ్బే! అది కాదండీ!” అంటూ మీ అభిప్రాయాలను చెప్తారా? ముందుగా నా అభిప్రాయం మీతో పంచుకుంటాను…. చదివాకా, మీ అభిప్రాయాలను కూడా జోడిస్తే మరింత సంతోషిస్తాను… ఙ్ఞానార్జన మానవ లక్షణం, ఎందుకంటే ఆలోచన, విచక్షణ, విశ్లేషణ అనే వరాలు కేవలం మానవజాతికి మాత్రమే భగవంతుడు ప్రసాదించాడు. మనం పీల్చే గాలి, మనం ఆరగించే ఆహారం,...

Read More