నిత్యనూతనమైన ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానము సంతరించుకుంటున్న ప్రపంచం మానవమనుగడకు రానురాను దుస్సాధ్యం అనిపించే వైపుగా వడివడిగా పరుగులు తీస్తోందని మీలో ఎవరికైనా భయం కలిగిందా?

ఒకసారి ఆలోచించాను, రెండు సార్లు, నాలుగు సార్లు కాదు ఎన్ని వందలసార్లు ఆలోచించి చూసినా జవాబు దొరకని ప్రశ్నలెన్నో…
కొన్ని మీ ముందుంచుతా.. కలిసి ఆలోచిద్దామా?!

mana yuvata mana bhavita, bhavalavanyam, lavanya, mana yuvata, yuva bharatam
 • Facebook
 • Google+
 • LinkedIn
 • Twitter
 • Gmail
 • Pinterest

 • అమ్మ వడిలో పారాడవలసిన పసి ప్రాయాలు కల్తీ పాలకు బలైపోతున్నాయెందుకు?
 • ఇంటి ముంగిట ప్రశాంతంగా ఆడుకోవలసిన చిన్న వయసులు కాంక్రీటు గోడలమధ్య ఙ్ఞానసముపార్జన పేరుతో బట్టీ పట్టే పాఠాలమధ్య నలుగుతున్నాయెందుకు?
 • ఆరుబయట ప్రశాంతంగా ఆడుకోవలసిన బాల్యం అపహరణల భయంతో కృంగిపోతున్నాయెందుకు?
 • ఇంటినుంచి కళాశాలలకు వెళ్ళే యువత మత్తుమార్గం పడుతున్నారెందుకు?
 • చదువులనీ ఉద్యోగాలనీ బయటకెళ్ళిన మన ఆడపిల్లలు ఎప్పుడు ఏ మానవ మృగ దాహానికి బలౌతారో అన్న భయంతో గడుపుతున్నామెందుకు?
 • రేపటి యువత భవిత ఇలా యంత్రాల మధ్య, కృత్రిమ బంధాలమధ్య, మత్తు, చెడు అలవాట్ల మధ్య, అసలు సభ్యసమాజం చూసి హర్షించలేని కథలను చక్కగా చిత్రించే సినిమాల మధ్య అదే హీరోయిజమనుకుంటూ గడపవలసినదేనా?

ఆద్యాత్మికం, సన్యాసం అనే చరమస్థాయికి చేరుకోనక్కరలేదు. కానీ ఇలా విషమ స్థాయికి పడిపోవడం కూడా సహించరానిది…
మనవంతు బాధ్యతగా మన తర్వాతి తరాలకు మంచి మార్గం చూపించడం అవసరం. సమాజం మరియూ కుటుంబపరమైన మార్పులు రావలసిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రధ్ధ బాధ్యత రెండూ కాస్త గట్టిగానే వహించవలసిన అవసరం ఉంది. దారి తప్పి అధోగతి పాలవకుండా వారిని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. వారికి ఇచ్చే స్వేఛ్ఛ వారు సద్వినియోగం చేసుకునేలా చేసే బాధ్యత మనది. నమ్మకం మంచిది, కానీ గుడ్డి నమ్మకం, అతిగారాబం అనర్ధాలకు దారి తీయకుండా వారికి సరైన మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉంది. దైనందిన జీవితం ఎంతలా పనులలో తలమునకలైనా కొంత సమయం మన పిల్లలపై మన కుటుంబానికై వెచ్చించడం అత్యంత ఆవశ్యకం.

ఇది సవినయ విన్నపం

ఆ దిశగా ఆలోచించి అడుగులేద్దాం

మన యువతకు బంగారు భవిష్యత్తు బాట చూపిద్దాం

#manayuvatamanabhavita, #bhavalavanyam, #lavanya, #manayuvata, #yuvabharatam